KRIYA - National Science Day 2024


2024 ఫిబ్రవరి 28 జాతీయ సైన్సు దినోత్సవం సందర్భంగా మీ పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహించినచో సైన్సు నమూనాలు/ప్రయోగాలు చేసిన ప్రతి విద్యార్థికి క్రియ స్వచ్ఛంద సంస్థ ద్వారా సర్టిఫికెట్లు పంపబడును. ఒక పాఠశాల నుండి కనీసం 25 మంది విద్యార్థులు పాల్గొనాలి. 50 కి మించి విద్యార్థులు పాల్గొన్నచో ప్రతి 50 మందికి ఒక సెట్ చొప్పున మెడల్స్ (గోల్డ్, సిల్వర్, బ్రాంజ్) కూడా పంపబడును.

దయచేసి 27.02.24 నాటికి క్రింది గూగుల్ ఫామ్ పూర్తిచేసి రిజిస్ట్రేషన్ చేసుకోమని మనవి.

https://forms.gle/3KnEGka3MGA67ReW6

సైన్స్ ఫెయిర్ నిర్వహించిన పాఠశాలలు వివరాలను, ఫొటోలను క్రింది టెలిగ్రామ్ గ్రూపులో ఫిబ్రవరి 28 వ తేదీన పోస్టుచేయమని మనవి.

https://t.me/+IM9S5LtUTck1YzFl

సందేహాలు ఉన్నచో పై టెలిగ్రామ్ గ్రూపులో తెలియచేయండి.

మీ పాఠశాల నుండి పాల్గొన్న ప్రతి 25 మంది విద్యార్థుల్లో ప్రతిభ కనపరచిన ఒక నమూనా/ప్రయోగాన్ని ఎంపిక చేసి ఆ విద్యార్థి పేరు, తరగతి, ఆ నమూనా/ప్రయోగం వివరిస్తున్న 3 నిముషముల లోపు వీడియోను కూడా ఫిబ్రవరి 28 వ తేదీన టెలిగ్రామ్ గ్రూపులో పోస్టుచేయమని మనవి. అలా వచ్చిన వీడియో ఎంట్రీల్లో కొంతమందిని ఎంపిక చేసి సైన్సు వర్కషాపుకు ఆహ్వానించడం జరుగుతుంది.

సర్టిఫికెట్లు, మెడల్స్ మీకు అందిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలైతే ఒక్కో విద్యార్థికి పది రూపాయలు చొప్పున, ప్రవేటు పాఠశాలలైతే ఒక్కో విద్యార్థికి ఇరవై రూపాయలు చొప్పున పాఠశాలల నుండి కంట్రిబ్యూషన్ కోరుచున్నాము.

- జగన్నాధరావు, కార్యదర్శి, క్రియ